Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ బ్రాండ్ వద్దు .. నన్ను ఎమ్మెల్యేగా తొలగించలేరు : ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలు

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బ్రాండ్ కింద ఎమ్మెల్యేగా తాను పనిచేయలేనని, వెంకటగిరి అభివృద్ధి కోసం జగన్‌కి లేఖలు రాస్తే ఇంత వరకు సమాధానం లేదన్నారు. తనను వైసీపీ నుంచి తొలగించారని, ఎమ్మెల్యే పదవి నుంచి మాత్రం ఎవరూ తీయలేరని ఆనం స్పష్టం చేశారు.

venaktagiri mla anam ramanarayana reddy comments ksp
Author
First Published Jan 23, 2024, 7:05 PM IST

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బ్రాండ్ కింద ఎమ్మెల్యేగా తాను పనిచేయలేనని, వెంకటగిరి అభివృద్ధి కోసం జగన్‌కి లేఖలు రాస్తే ఇంత వరకు సమాధానం లేదన్నారు. తనను వైసీపీ నుంచి తొలగించారని, ఎమ్మెల్యే పదవి నుంచి మాత్రం ఎవరూ తీయలేరని ఆనం స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా వుండగానే ఓ అనధికారిక ప్రతినిధిని ఇక్కడ పెట్టారని, అందుకే ఏడాదిగా తాను వెంకటగిరి ప్రజలకు దూరంగా వున్నానని రాంనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాల్లోకి సక్రమంగా రావడం లేదని, ప్రభుత్వ జాప్యంతో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయానని ఆనం దుయ్యబట్టారు. 

తనపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ఆనం హెచ్చరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై చేసిన ఆరోపణలని ఎవరూ నిరూపించలేదన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏది ఆదేశిస్తే అది చేస్తానని రాంనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని, వెంకటగిరి నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని తాము నిలబెట్టుకుంటామని ఆనం స్పష్టం చేశారు. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభలో ఆనం రాం నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మాఫియా పెరిగిపోయిందన్నారు. అప్పటి నుంచే తనపై కక్షగట్టారని, వెంకటగిరికి ఏదీ కావాలని అడిగినా ఆ అభ్యర్ధులను బుట్టదాఖలు చేస్తున్నారని రాంనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల కోసం ఏనాడూ ఆశపడలేదని, పట్టణానికి 100 పడకల ఆసుపత్రి, స్వర్ణముఖి లింక్ కాలువకు నిధులు కోరినా పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. పంచాయతీ నిధులు మళ్లించారని, ఆ డబ్బు గురించి అడిగితే జగన్ ఇబ్బంది పెట్టారని రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios