వైసిపి తరపున రాజ్యసభ అభ్యర్ధిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. బుధవారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో అమరావతిలోని అసెంబ్లీ కార్యదర్శికి వేమిరెడ్డి తన నామినేషన్ పత్రాలను అందచేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డిని రాజ్యసభ అభ్యర్ధిగా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

44 మంది ఎంఎల్ఏల బలమున్న వైసిపికి ఒక రాజ్యసభ స్ధానం దక్కుతుంది. ఎవరి బలాల ప్రకారం వాళ్ళు పోటీ చేస్తే వైసిపి తరపున వేమిరెడ్డి గెలవటం ఖాయం. మరి చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి? 

వచ్చే నెలలో మూడు స్ధానాలు భర్తీ చేయాలి. అందులో రెండు టిడిపికి ఒకటి వైసిపికి దక్కుతాయి. అందులో భాగంగానే వేమిరెడ్డి ఈరోజు మూడు సెట్ల నామినేఫన్లను దాఖలు చేశారు. కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.