Asianet News TeluguAsianet News Telugu

అమరావతిపై వ్యాఖ్యలు: బీజేపీ నుండి వెలగపూడి గోపాలకృష్ణ సస్పెన్షన్

 రాష్ట్రంలో మరో నేతపై బీజేపీ నాయకత్వం చర్యలు తీసుకొంది. అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.

velagapudi gopalakrishna suspends from bjp
Author
Amarante, First Published Aug 9, 2020, 6:15 PM IST


అమరావతి: రాష్ట్రంలో మరో నేతపై బీజేపీ నాయకత్వం చర్యలు తీసుకొంది. అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.

ఇటీవలనే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణను కూడ పార్టీ నుండి సస్పెండ్ చేసింది బీజేపీ. టీవీ చర్చల్లో పాల్గొన్న బీజేపీ నేతకు కూడ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీంతో మనోవేదనకు గురైన తురగ శ్రీరామ్ పార్టీకి రాజీనామా చేశారు.

తాజాగా అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పత్రికల్లో వ్యాసం రాసినందుకు గాను గోపాలకృష్ణపై బీజేపీ నాయకత్వం చర్యలు తీసుకొంది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది,

also read:సుజనాకు సోము వీర్రాజు షాక్: కమలదళాధిపతి ఇచ్చిన సంకేతం ఇదీ....

పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా మీ ప్రకటనలు ఉన్నాయని బీజేపీ ప్రకటించింది. అమరావతి రైతుల పక్షాన నిలబడడం లేదని మీరు చేసిన ఆరోపణ నిరాధారమైందని బీజేపీ ప్రకటించింది.  మీ ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తున్నామని ఓ ప్రకటనలో బీజేపీ ప్రకటించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios