ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణంలో వాస్తు దోషం చాలా ఉందని సిద్ధాంతి గోటూరి పాములు అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

అమరావతిలో ప్రభుత్వం కార్యాలయంలో అనేక వాస్తు దోషాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సెక్రటేరియట్‌‌ను నిర్మించే విషయంలో తప్పుడు వాస్తు ప్రకారం కట్టడాలు కట్టారని సిద్ధాంతి స్పష్టం చేశారు. వాస్తుకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాస్తు వ్యతిరేకంగా నిర్మించడం ద్వారా రాబోవు ప్రభుత్వలకు నష్టాలు ఏర్పడతాయని గోటూరి పేర్కొన్నారు.

సెక్రటేరియట్ రూట్ చివరకు కట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముందు అసెంబ్లీ కట్టారని.. తూర్పు మూతపడిపోయిందని చెప్పారు. దీని వల్ల నష్టం జరుగుతుందని చెప్పారు. ఒక్క ఈశాన్య గేట్ తప్ప... మొత్తం సెక్రటేరియట్ వాస్తు సరిగా లేదన్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినా... వారికి  నష్టం తప్పదని హెచ్చరించారు. సిద్ధాంతి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.