ఎపికి రాజధాని లేకుండా చేశారు: బాబుపై వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma says AP has no capital
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధాని లేకుండా చేశారని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు.

నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆమె శనివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. గత నాలుగేళ్ల పాలనలో ఎపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ఏపీకి అస్థిత్వం లేకుండా అన్యాయం చేశారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు చూస్తే ఆశ్చర్యమేస్తుందని ఆమె అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టేలా పాలన కొనసాగించారని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రజలకు అభద్రతాభావం కల్పించిన చంద్రబాబును మళ్లీ ఎందుకు ఆశీర్వదించాలని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం చేసిన టీడీపిని ఎందుకు గెలిపించాలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చెప్పాలని ఆమె అన్నారు.

loader