Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ నిర్భయ ఘటన చాలా చిన్నది...రాజమండ్రి ఘటన ముందు: వర్ల రామయ్య

ఏపీ ప్రభుత్వం దళితవర్గాలపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని... ఆయా వర్గాలపై దాడులు, అవమానాలు జరుగుతున్నా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Varla ramaiah serious on ycp  govt over dalit attacks
Author
Vijayawada, First Published Jul 28, 2020, 10:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: ఏపీ ప్రభుత్వం దళితవర్గాలపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని, ఆయా వర్గాలపై దాడులు, అవమానాలు జరుగుతున్నా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ, తనను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే దాన్ని పోలీసులు పక్కన పడేశారన్నారు. వైసీపీ వారు తిరిగి మేజిస్ట్రేట్  పై ఫిర్యాదు చేసి, ఎప్పుడో జరిగిన జూనియర్ కాలేజీ వివాదాన్ని తెరపైకి తెచ్చి ఆయనపై  తప్పుడు కేసు పెట్టారన్నారు. ఏ ప్రభుత్వంలో కూడా ఇలా కౌంటర్ రియాక్షన్ చూడలేదని వర్ల తెలిపారు.

జగన్ మనస్తత్వమే అర్థం కావడం లేదని... మేజిస్ట్రేట్ కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రే ఎదురు కేసులు పెట్టిస్తూ ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు. దళితవర్గాలన్నీ తన కాళ్లకింద పడి ఉండాలన్న ఆలోచన జగన్ లో ఉందని, ఆయన చర్యలే అందుకు నిదర్శనమన్నారు. మేజిస్ట్రేట్ ను వేధింపులకు గురిచేసిన మంత్రి పెద్దిరెడ్డిపై, నాగార్జునరెడ్డిపై చర్యలు తీసుకోకుండా బాధితుడిపై  తప్పుడు కేసులతో వేధింపులకు దిగడమేమిటని వర్ల  ప్రశ్నించారు. కాలేజీ వివాదంలో మేజిస్ట్రేట్ రామకృష్ణకే డబ్బులు రావాల్సి ఉన్నప్పటికీ ఆయన్నే బెదిరించడం అన్యాయమన్నారు. 

ఏ ప్రభుత్వం కూడా  జగన్ ప్రభుత్వంలా దళితులపై ఇంత అధ్వాన్నంగా ప్రవర్తించడం లేదన్నారు. రామకృష్ణకు వ్యతిరేకంగా జరిగే ధర్నాలు, ఆందోళలనలన్నీ ముఖ్యమంత్రే చేయిస్తున్నాడని రామయ్య మండిపడ్డారు. దళితవర్గాలన్నీ తన కాళ్లకింద పడి ఉండాలన్న ఆలోచనలో జగన్ ఉన్నాడని, అందుకే ఇలా వ్యవహరిస్తున్నాడన్నారు. మంత్రిపై, నాగార్జున రెడ్డిపై చర్యలు తీసుకోకుండా మేజిస్ట్రేట్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేయించడం ఏమిటని వర్ల నిలదీశారు. 

జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో దళితులకు స్థానం ఉందో లేదో ఆయనే చెప్పాలన్నారు. పోలీస్ శాఖ ఎందుకింతలా దిగజారిందో తెలియడం లేదని, అధికారులు తమ ఔన్నత్యాన్ని కోల్పోయారన్నారు.  ఇన్ని రకాలుగా వేధించే బదులు రామకృష్ణను, ఆయన కుటుంబసభ్యులను కాల్చిపడేయాలని రామయ్య మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయాల్సిన వ్యక్తే కౌంటర్ ఉద్యమాలు చేయించడం దారుణమన్నారు.

read more   పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఆ అవకాశం...పేర్లు సిఫారసు..: వైవి సుబ్బారెడ్డి 

తూర్పుగోదావరిలో జరిగిన శిరోముండనం ఘటనకు కారకుడైన కవల కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో చెప్పాలన్నారు. అధికారులు, మంత్రులు వెళ్లి బాధితుడిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. సబ్ ఇన్ స్పెక్టర్ కాల్ లిస్ట్ తీస్తే, ఎవరు నిజమైన దోషులో తేలిపోతుందన్నారు. 

రాజమండ్రిలో దళితబాలికపై జరిగిన అత్యాచార ఘటన ముందు ఢిల్లీ నిర్బయ ఘటన చాలా చిన్నదన్నారు వర్ల. పులులు మేకను వెంటాడినట్లు 12మంది దుర్మార్గులు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. దళితులు పుట్టిందే ఇటువంటి వాటికోసం అన్నట్లుగా ముఖ్యమంత్రి పాలన ఉందని వర్ల వాపోయారు. అంతటి దుర్మార్గం జరిగితే హోంమంత్రి సుచరిత, ఇతర అధికారులు ఇప్పటివరకు బాలికను ఎందుకు పరామర్శించ లేదో సమాధానం చెప్పాలన్నారు. బాలికకు అందుతున్న వైద్యవివరాలు తెలియచేస్తూ, ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని రామయ్య డిమాండ్ చేశారు. 

 దళితులు బాధితులైతే ఏమీ పట్టించుకోకుండా ముందుకెళ్లడం జగన్ విధానమా? అని వర్ల ప్రశ్నించారు. అధికార యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాన్ని కూడా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ -1989ప్రకారం దళితులపై జరిగిన దాడులన్నింటిలో ముద్దాయిగా చేర్చాలని రామయ్య డిమాండ్ చేశారు. వైసీపీలోని వర్గ వైషమ్యాలే చీరాలలో దళిత యువకుడి ప్రాణం తీశాయని, అతని మరణానికి ఈ ప్రభుత్వం రూ.10లక్షల వెలకట్టడం దారుణమన్నారు. 

డపల్నాడులో విక్రమ్ అనే దళిత యువకుడిని కూడా ఇలానే పొట్టన పెట్టుకున్నారన్నారు. రోజు పోలీస్ స్టేషన్ కు పిలిపించి పాశవికంగా నరికేయించారని, ఆ ఘటనకు ఎవరు బాధ్యులో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. దళితవర్గాల్లో పుట్టింది కాబట్టే సదరు అత్యాచారా బాధితురాలు ముఖ్యమంత్రి చూపుకు కూడా నోచుకోలేదన్నారు.  శిరోముండనం వ్యవహారం, దళిత బాలికపై అత్యాచారం, పల్నాడులో విక్రమ్ హత్య, మేజిస్ట్రేట్ వ్యవహారం, చీరాలలో కిరణ్ కుమార్ అంశాలపై ముఖ్యమంత్రి తక్షణమే సీబీఐ విచారణకు అప్పగించాలన్నారు. 

జగన్ నేరచరిత్ర చూసి కూడా దళితులు ఆయనకు ఓట్లేశారని, ఆయనకు ఏమాత్రం ఆ జాతిపై గౌరవం ఉంటే, తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలనే ఆలోచన ఉంటే, తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. వైసీపీలోని దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని, దళిత జాతికి జరుగుతున్న అన్యాయంపై  కళ్లు తెరవాలని రామయ్య సూచించారు. సదరు  నేతలంతా వారి బిడ్డల ఆక్రందన, ఘోషను వినాలన్నారు వర్ల. 

Follow Us:
Download App:
  • android
  • ios