అధికార పార్టీ నేత లైంగిక వేధింపులకు తాళలేక.. దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడిన వీఏఓ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని.. ఆమె చనిపోతే కానీ చర్య తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమరావతి : కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి గ్రామ వీఏఓ గGarikapati Nagalakshmi ఆత్మహత్య ఉదంతం… YCP నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు ఎంతలా తలొగ్గుతున్నారో, వారు చెబితే Sexual harassment ఫిర్యాదుల పైనా కేసు పెట్టకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారబ చెప్పేందుకు తార్కాణంగా నిలుస్తుంది. వైసీపీ గ్రామ స్థాయి నాయకుడు Garikapati Narasimha Rao లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని దుర్భాషలాడుతూ… ప్రభుత్వ కార్యాలయంలోనే దాడికి ప్రయత్నించాడని ఫిబ్రవరి 24నే ఆమె బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. కిందిస్థాయి అధికారులు ఆ నాయకుడు ఒత్తిళ్లకు తలొగ్గారని.. అదే ఎస్పి అయితే న్యాయం చేస్తారని భావించి.. స్పందన కార్యక్రమంలో ఈ నెల 14న నేరుగా కృష్ణా జిల్లా SP Siddharth Kaushalకు ఆమె ఫిర్యాదు చేసింది.

అక్కడా స్పందన రాలేదు. ఎస్పీయే తనకు న్యాయం చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారంటూ నిస్సహాయస్థితిలో ఆ తర్వాత రెండు రోజులకే అంటే ఈ నెల 16న ఆత్మహత్యకు పాల్పడి 17వ తేదీ ఉదయం 4.45 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు. ఆమె ప్రాణాలతో ఉన్నప్పుడు ఫిర్యాదుపై చర్యలు తీసుకోని పోలీసులు.. నాగలక్ష్మి మరణం తర్వాత విమర్శలు వెల్లువెత్తుతుండడంతో స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 16న లైంగిక వేధింపుల, బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మీడియాకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీన నాగలక్ష్మి కుమారుడు పార్థశివసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదేరోజు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నిందితుడిని వెనక నిల్చోబెట్టి, ముందు వరుసలో డిఎస్పి మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు కూర్చుని తీయించుకున్న ఫోటోలు మీడియాకు విడుదల చేశారు.

అప్పటివరకు నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదు?
పోలీసులు చెబుతున్నట్లు 16వ తేదీనే లైంగిక వేధింపుల సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుంటే అదేరోజు నిందితుడిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? కనీసం కేసు నమోదు చేసినట్లు అయినా ఆమెకు చెప్పి ఉంటే ఇంతటి విషాదం చోటుచేసుకునేది కాదు కదా?’ అని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదుపై నరసింహారావు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఓ మహిళ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామనడం వివాదాస్పదంగా మారుతోంది. 

దిశ యాప్ తెచ్చామని మహిళలపై నేరాల విషయంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పే ఉన్నతాధికారులు… ప్రభుత్వం లోనే పనిచేసే ఓ మహిళా తనపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసే పట్టించుకోకపోవడం అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉందని, కేసు నమోదు చేయని స్టేషన్ హౌస్ అధికారి అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అందరూ కలిసి నా సోదరుని హత్య చేశారు..
గ్రామస్థాయి వైసీపీ నాయకుడైన గరికపాటి నరసింహారావు కోసం అధికారులు పోలీసులు రాజకీయ నాయకులు అందరూ కలిసి నా సోదరి హత్య చేశారని నాగలక్ష్మి సోదరుడు భోగాది వినయ్ బాబు ఆరోపించారు.

 కోరిక తీర్చాలని వేధించారు..
‘వైసీపీ నేత గరికపాటి నరసింహారావు చాలా సార్లు తన కోరిక తీర్చాలని నన్ను అడిగారు. నేను రాయడానికి వీలులేని విధంగా అసభ్యకరంగా ప్రవర్తించారు. నా వైపు వంకరగా చూస్తూ, వంకర గా మాట్లాడుతూ, ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించారు. ఆ విషయాలు బయటపెడితే నా కాపురం దెబ్బతింటుందని, ఉద్యోగం చేయనివ్వరు అనే ఉద్దేశంతో ఇంట్లో ఆ విషయం చెప్పలేకపోయాను’ అని ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్న నాగలక్ష్మి ఈనెల 14న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నా బాధల్ని నా సన్నిహితులైన అనిశెట్టి లంకమ్మ, మోకా జీవన్ బాబు, ఇంకొందరికి చెప్పాను. వారు ఈ ఏడాది జనవరి 26న నరసింహారావును మందలించారు.

 అప్పటి నుంచి ఆయన నన్ను మరింతగా వేధించడం మొదలు పెట్టారు. వెలుగు కార్యక్రమంలో జరిగిన గొడవలో అతడి భార్య ముందే ‘ఎప్పటికైనా నిన్ను అనుభవించి తీరతా’ అంటూ నన్ను హెచ్చరించారు. నరసింహారావు నుంచి నాకు ప్రాణ భయం ఉంది. నేను ఫిబ్రవరి 24న తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు’ అని ఫిర్యాదులో వివరించారు.