మరోసారి కలిసిన ముగ్గురు మిత్రులు: గుడివాడలో ఒకే వేదికపై కొడాలి నాని, వంశీ, వంగవీటి రాధా
గుడివాడలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒేక వేదికను పంచుకొన్నారు. కొంత కాలంగా వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో భాగంగా గుడివాడలో పాల్గొన్నారు.
గుడివాడ: ముగ్గురు మిత్రులు మరోసారి కలిశారు. వంగవీటి రాధా వర్థంతి కార్యక్రమంలో పాత మిత్రులు మరోసారి కలిశారు. గుడివాడలో ముగ్గురు మిత్రులు కలిశారు. అయితే ముగ్గురు మిత్రులు కలవడం ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
వంగవీటి రంగా 33 వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే vallabhaneni Vamsi పాల్గొన్నారు. Vangaveeti Radha తో కలిసి వల్లభనేని వంశీ రంగా విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత వంగవీటి రాధా గుడివాడలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి ఆయన గుడివాడకు వెళ్లారు. గుడివాడ కొండాలమ్మ గుడిలో ఈ ముగ్గురు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2014 ఎన్నికల సమయంలో వంగవీటి రాధా వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీలో చేరారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వంగవీటి రాధా, kodali nani ఇద్దరు ycp లో ఉన్నారు. అయితే ఆ సమయంలో వల్లభనేని వంశీ tdp లో ఉన్నారు. అయితే ఆ సమయంలో విజయవాడ టూర్ లో ఉన్న వైఎస్ జగన్ ర్యాలీకి ఎదురుగా వల్లభనేని వంశీ కాన్వాయ్ వెళ్లింది. ఆ సమయంలో వల్లభనేని వంశీ కాన్వాయ్ ను పోలీసులు నిలిపివేశారు. అయితే వల్లభనేని వంశీని జగన్ కు గన్నవరం ఎమ్మెల్యే కొడాలి నాని పరిచయం చేశారు. దీంతో వల్లభనేని వంశీని జగన్ కౌగిలించుకొన్నారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. 2014 ఎన్నికలు జరగడానికి ముందు ఈ ఘటన చోటు చేసుకొంది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీలోనే ఉన్నారు. ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు పలికారు.
2019 ఎన్నికల ముందు సీటు విషయంలో వైసీపీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో వంగవీటి రాధా టీడీపీలో చేరారు. ఈ ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. అయితే పార్టీలు వేరైనా కూడా ఈ ముగ్గురు కూడా స్నేహంగా ఉంటారు.
also read:నా హత్యకు కుట్ర జరుగుతోంది.. భయపడేది లేదు, జనంలోనే వుంటా : వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు
వంగవీటి రాధాతో ఇవాళ ఉదయం వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత వీరిద్దరూ కలిసి గుడివాడకు వెళ్లారు. Gudivadaలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు కలిశారు. 2019 ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు కలిసి పాల్గొన్న కార్యక్రమం ఇదే మొదటిది. గుడివాడలో నిర్వహించిన కార్యక్రమంలో వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర చేశారన్నారు. ఈ మేరకు రెక్కీ నిర్వహించారని కూడా ఆయన చెప్పారు. ఈ విషయమై త్వరలోనే తెలుస్తుందన్నారు.వంగవీటి రాధా టీడీపీని వీడుతారా అనే చర్చ సాగుతుంది. వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారా అనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై రాధా నుండి స్పష్టత రాలేదు. ఇదే విషయమై పాత మిత్రులు వంగవీటి రాధాతో చర్చించారా అనే చర్చ కూడా సాగుతుంది. పార్టీలు వేరైనా ఈ ముగ్గురు మిత్రులు కలుసుకొంటుంటారు. అయితే ఇవాళ ముగ్గురు మిత్రులు కలిసిన రోజునే వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయంగా చర్చకు కారణమైంది.