జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేత వంగవీటి రాధా మరోసారి భేటీ అయ్యారు.  సోమవారం సుమారు గంటపాటు వీరిద్దరూ సమావేశమై చర్చించుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఇవాళ విజయవాడ పటమటలోని పవన్ నివాసంలో మరోసారి భేటీ అయ్యి పార్టీలో చేరిక తేదీపై చర్చించినట్లు సమాచారం. 

ఈ బేటీలో పవన్- రాధాతో పాటు పి.రామ్మోహన్, రియాజ్, హరిప్రసాద్ పాల్గొన్నారు. రాధా తండ్రి, దివంగత నేత వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా జులై 4 లేదా 5 న జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  కాగా ఇప్పటి వరకూ ఈ భేటీపై అటు జనసేన నుంచి గానీ.. ఇటు వంగవీటి కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే... రాధా జనసేనలో చేరడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. 

గతంలో వైసీపీ నేతగా ఉన్న రాధా మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంటో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో.. ఆయన జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.