కృష్ణాజిల్లా రాజకీయాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు బాహాబాహా స్థాయికి చేరి పోలీస్ స్టేషన్ కి చేరింది. వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు తెలపడం మొదలైనప్పటినుండి గన్నవరంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అది  తార స్థాయికి చేరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. 

యార్లగడ్డ వర్గీయులపై  వంశి వర్గీయులు దాడి చేయడంతో ఇటు వంశి వర్గీయులు, అటు యార్లగడ్డ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. గన్నవరం మండలం చిన్నావుటపల్లి మాజీ సర్పంచి, వైసీపీ నాయకులు కోట వినయ్ పై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి చేసారు. 

తన వర్గీయులపై దాడి చేయడంతో కృష్ణ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్, 2014లో గన్నవరం నుండి వైసీపీ టికెట్ పై పోటీ చేసి స్వల్ప  తేడాతో ఓడిన యార్లగడ్డ తన అనుచరులతో పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఫిర్యాదు చేసారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరిన యార్లగడ్డ. 

స్టేషన్ వద్దకు జనం భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇన్ని రోజులు కోల్డ్ వార్ గా నడిచిన అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా హీటెక్కాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.