విజయవాడ కనకదుర్గ దేవాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెండి రథాలు మాయమయ్యాయంటూ అసత్య ప్రచారం చేశారు.

అమ్మవారి రథంలో మూడు వెండి సింహాలు మాయమయ్యాయంటూ దుండగులు పోస్టు చేశారు. దీనిపై స్పందించిన విజయవాడ వన్‌టౌన్ పోలీసులు.. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఇది తప్పుడు ప్రచారమంటూ దుర్గగుడి ఈవో సురేశ్ తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.