ఇంట్లోకి చొరబడి అత్తా, కొడుకుని చితకబాది వివాహితను దుండుగులు ఎత్తుకెళ్లిన దారుణం పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది.
నరసరావుపేట : ఓ కుటుంబంపై దాడిచేసిన దుండగులు ఆ ఇంటి కోడలిని ఎత్తుకెళ్లిన దారుణం పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.ఇంట్లోకి చొరబడ్డ దుండుగులు అత్త, కొడుకును చితకబాది వివాహితను అపహరించుపోయారు. ప్రస్తుతం నాన్నమ్మ, మనవడు గాయాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా కిడ్నాప్ కు గురయిన వివాహిత ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు.
బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు జగనన్న కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడ్డ ఐదుగురు దుండుగులు అత్త నాగలక్ష్మిని చితకబాది 26 ఏళ్ల కోడలు లక్ష్మీ ప్రణతిని ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాగలక్ష్మి నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.
వీడియో
తనపై దాడి, కోడలి అపహరణపై నాగలక్ష్మి స్పందించారు. తనకు తెలిసినవారే ఈ పని చేసారని... శ్రీను, రమేష్, చంటి ఇంకో ఇద్దరితో కలిసి ఇంటిపైకి వచ్చారని తెలిపారు. తనతో పాటు మనవడిపై దాడిచేసి కోడలు ప్రణతిని ఎత్తుకెళ్లిపోయారని నాగలక్ష్మి తెలిపారు. తన కోడలిని ఎక్కడికి తీసుకెళ్లారో, ఏం చేసారో అంటూ నాగలక్ష్మి ఆందోళన వ్యక్తం చేసింది.
Read More భార్యతో గొడవ.. కదులుతున్న ఆటోలోంచి దూకి భర్త మృతి...
తన కోడలి కిడ్నప్, తమపై జరిగిన దాడిపై పోలీసులకు పిర్యాదు చేసినట్లు నాగలక్ష్మి తెలిపారు. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని నాగలక్ష్మి కోరుతోంది.
