ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించడానికి రెండు కుటుంబాలు వచ్చాయి. ఇద్దరు మహిళలు స్నానం చేయడానికి సమీపంలోని తాత్కాలిక మరుగుదొడ్లలోకి వెళ్లారు. ఓ దుండగుడు వెంటిలేటర్ నుంచి చూపిస్తూ ఫోన్‌లో రికార్డు చేయడం గమనించి మహిళలు కేక పెట్టడంతో ఆ ఆగంతకుడు పారిపోయారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లాలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట ఆలయానికి వచ్చిన మహిళఆ భక్తులు అక్కడే ఉన్న తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేయడనికి వెళ్లారు. అదే సమయంలో ఓ యువకుడు సెల్ ఫోన్ తీసి వారిని రికార్డ్ చేయడానికి ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది.
ఒంటిమిట్ట ఆలయానికి రెండు కుటుంబాలు వచ్చాయి. నిన్న ఉదయం 9.30 గంటలకు ఆ కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లలోకి వెళ్లారు. స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళారు. అంతలోనే ఓ యువకుడు చేతిలో సెల్ ఫోన్ పట్టుుకని లోపలికి చూశాడు. వెంటిలేటర్ గుండా వారిని రికార్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ మహిళలు ఆయనను గమనించి వెంటనే కేకలు వేశారు. దీంతో ఆ ఆగంతకుడు స్పాట్ నుంచి పారిపోయాడు.
Also Read: Andhra Pradesh: చిన్ని కుటుంబం చెరిగిపోయింది.. భార్య, పిల్లలను చంపేసి భర్త సూసైడ్
ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు మౌఖకంగా ఫిర్యాదు అందించారు. దీంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలింపులు మొదలు పెట్టారు. ఇంకా ఆచూకీ దొరకలేదు. ఈ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదని తెలిసింది. మహిళల స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదుల వద్ద మంచి భద్రత చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటామని వివరించారు.
