నెల్లూరు జిల్లా కావలిలో గురువారం నాడు ఉదయం షకీలా అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన కావలిలో కలకలం రేపింది. 


నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో గురువారం నాడు ఉదయం షకీలా అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన కావలిలో కలకలం రేపింది.

కావలిలోని ఓ కాలనీలో షకీలా అనే మహిళ నివాసం ఉంటుంది. భర్తతో గొడవల కారణంగా ఆమె భర్తకు దూరంగా విడిగా ఉంటుంది. కావలిలోనే వస్త్ర దుకాణంలో ఆమె పనిచేస్తోంది. పుచ్చలవారి వీధిలో ఆమె తరచూ ఒకరి ఇంటికి వెళ్లేది. ఆమె రాకపోకలపై నిఘా వేసిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవాళ ఉదయం కూడ షకీలా పుచ్చలవారి వీధిలోని ఓ ఇంటికి వెళ్లింది. అక్కడే మాటు వేసిన ఓ దుండగుడు ఆమెతో గొడవకు దిగాడు. తనతో తెచ్చుకొన్న కత్తితో దుండగుడు ఆమె గొంతు కోశాడు.

తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.షకీలాకు తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడ్డారా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.