Asianet News TeluguAsianet News Telugu

Kishan Reddy: మూడు రాజధానులు రద్దుచేస్తే స్వాగతిస్తాం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మూడు రాజధానుల అంశానికి సంబంధించి నేడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy).. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు రద్దు (Three capital Bill) చేస్తే స్వాగతిస్తామని అన్నారు. 

Union Minister says we will welcome if three capital bill withdrawn
Author
Hyderabad, First Published Nov 22, 2021, 2:28 PM IST

ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో భేటీతో ఏపీ బీజేపీ నేతల భేటీ తర్వాత రాష్ట్ర రాజధాని విషయంలో (AP Capital Issue) వారి వైఖరిలో మార్పు చోటుచేసుకన్న సంగతి తెలిసిందే. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రకు ఏపీ బీజేపీ నేతలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆదివారం ఏపీ బీజేపీ (AP BJP) నేతలు రైతుల పాదయాత్రలో పాల్గొని.. వారికి సంఘీభావం తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటుగా పలువురు ముఖ్య నేతలు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందనే మాటకు బీజేపీ కట్టుబడి ఉంటుందని వారు స్పష్టం చేశారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశానికి సంబంధించి నేడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.  రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేసినట్టుగా అడ్వొకెట్ జనరల్ ఎస్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకు (AP High Court) తెలిపారు. ఇందుకు సంబంధించి మరికాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణపై ఎలాటి నిర్ణయం వెలువడుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. 

తాజాగా ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy).. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు రద్దు చేస్తే స్వాగతిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక స్టాండ్‌ తీసుకుందని.. అందుకే అమరావతి రైతుల వెంట ఏపీ బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొన్నరని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అమరావతి రైతులు పాదయాత్రకు మద్దుతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆయన త్వరలోనే రాజధాని రైతులను కలిసి.. వారికి సంఘీభావం తెలుపనున్నాట్టుగా సమాచారం. 

సంచనలంగా మారిన మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు.. 
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ‌కు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా రాయల చెరువు వద్ద మీడియాలో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి..ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం చేసిందో తనకు ఐడియా లేదన్నారు. లీగల్, టెక్నికల్ ఇష్యూ కోసమే ఇలా చేసి ఉంటున్నారని తాను అనుకుంటున్నట్టుగా చెప్పారు.

చట్టం ఉపసంహరణ ఇంటర్వెట్ మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. శుభం కార్డు పడేందుకు మరింత సమయం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు సరిద్దిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ అని పేర్కొన్నారు. తాను ఇప్పటికి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షల మందితో సాగుతోందా  అని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర అనేది పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని ఆరోపించారు. రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios