విజయవాడ:బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు. 

అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శించుకొన్నారు.  అనంతరం ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

also read:దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు.  ప్రపంచంలోనే లక్షలాది మంది సభ్యులున్న పార్టీ బీజేపీ అని ఆయన గుర్తు చేశారు.

పదవులున్నా లేకున్నా పార్టీ బీజేపీ నేతలు కుటుంబంలా కలిసి పనిచేస్తూ పార్టీని ముందుకు నడుపుతున్నారని చెప్పారు.కార్యకర్తస్థాయి నుండి సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడి పదవిని అలంకరించారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త కార్యాలయాన్ని తీసుకొన్నారు. ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.