Asianet News TeluguAsianet News Telugu

వచ్చే వారం ఏపీకి అమిత్ షా : కర్నూలు, హిందూపురంలో టూర్ .. బహిరంగ సభలో పాల్గొనే ఛాన్స్..?

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే వారం ఏపీలో పర్యటించనున్నారు. కర్నూలు, హిందూపురంలలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. 

union home minister amit shah tour in andhra pradesh on january 8th
Author
First Published Jan 1, 2023, 8:04 PM IST

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే వారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ నెల 8న కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ప్రవాసి యోజన కార్యక్రమంలో భాగంగా కర్నూలుతో పాటు హిందూపురంలో ఆయన పర్యటిస్తారని బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలులో జరిగే బహిరంగసభలో అమిత్ షా ప్రసంగిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇదిలావుండగా .. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే.  రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను సీఎం వివరించారు.కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు  అన్ని ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని  సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ALso REad: రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతులిప్పించండి: హోంమంత్రి అమిత్ షాతో జగన్

తెలంగాణ ప్రభుత్వం , ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే  పాలుమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణ పనులను జగన్  అమిత్ షాకు వివరించారు. తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని హోంమంత్రి అమిత్‌షాను కోరారు సీఎం జగన్ .ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రికి  సీఎం జగన్  చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని హోం మంత్రికి  జగన్  చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేరని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఆయన  కోరారు. 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు  రూ. 32,625.25 కోట్ల బకాయిలను మంజూరు చేయాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం  ఖర్చు చేసిన రూ.2,937.92  కోట్ల ను వెంటనే చెల్లించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు.తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగాహోం మంత్రిని కోరారు సీఎం జగన్.

Follow Us:
Download App:
  • android
  • ios