Asianet News TeluguAsianet News Telugu

రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతులిప్పించండి: హోంమంత్రి అమిత్ షాతో జగన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య  సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. 40 నిమిషాల పాటు   అమిత్ షాతో  జగన్  ఇవాళ భేటీ అయ్యారు. 

AP CM YS Jagan  Requests   Union Home minister Amit Shah to Resolve bifurcation issues
Author
First Published Dec 29, 2022, 4:08 PM IST

న్యూఢిల్లీ: రాయలసీమ లిఫ్ట్‌ఇరిగేషన్‌ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను  ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారుగురువారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్  కేంద్ర మంత్రి అమిత్ షాతో  సుమారు  40 నిమిషాల పాటు సమావేశమయ్యారు.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను సీఎం వివరించారు.

కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.  కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు  అన్ని ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని  సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

also read:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ: కీలకాంశాలపై చర్చ

తెలంగాణ ప్రభుత్వం , ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే  పాలుమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణ పనులను జగన్  అమిత్ షాకు వివరించారు.  తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని హోంమంత్రి అమిత్‌షాను కోరారు సీఎం జగన్ .ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రికి  సీఎం జగన్  చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని హోం మంత్రికి  జగన్  చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేరని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఆయన  కోరారు. 2014–15 కు సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు  రూ. 32,625.25 కోట్ల బకాయిలను మంజూరు చేయాలని సీఎం కోరారు. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం  ఖర్చు చేసిన రూ.2,937.92  కోట్ల ను వెంటనే చెల్లించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు.తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగాహోం మంత్రిని కోరారు సీఎం జగన్.

జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవన్నారు. దీంతో  ఏపీ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని సీెం చెప్పారు.  నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్‌ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. . విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమమన్నారు. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఎం హోంమంత్రిని కోరారు. 

జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందన్నారు. రాష్ట్రంలో మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరుచేయాలని హోంమంత్రిని  సీఎం కోరారు.కడపలో నిర్మించనన్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని సీఎం కోరారు.విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios