పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సత్తా చూపించారు. పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 

పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సత్తా చూపించారు. పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పుంగనూరులోని 85 పంచాయతీల్లో వైసీపీ ఏకగ్రీవాలు నమోదు చేసింది. అలాగే మొత్తం 868 వార్డ్‌లను ఏకగ్రీవం చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు వున్నాయి.

ప్రస్తుతం మూడు విడతల్లో 5 మండలాల్లోని 85 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, మూడో విడత ఎన్నికలు జరగనున్న 3,221 పంచాయతీల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది.

Also Read:నిమ్మగడ్డకు షాక్: మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన ఏపీ హైకోర్టు

అనంతరం ఎంతమంది పోటీలో ఉన్నారన్న స్పష్టత రానుంది. నాలుగో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

13 జిల్లాల్లోని 19 రెవెన్యూ డివిజన్లలో 3వేల 249 పంచాయతీలు, 32వేల 502 వార్డులకు ఫిబ్రవరి 17న పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఫలితాలు రానున్నాయి. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు.