మాజీ సీఎం కిరణ్‌తో ఉమెన్ చాందీ భేటీ.. కెప్టెన్ కాంగ్రెస్‌లో చేరుతారా..?

First Published 1, Jul 2018, 3:47 PM IST
umman chandi meets ex cm kiran kumar reddy
Highlights

మాజీ సీఎం కిరణ్‌తో ఉమెన్ చాందీ భేటీ.. కెప్టెన్ కాంగ్రెస్‌లో చేరుతారా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కిరణ్ నివాసానికి చేరుకున్న చాందీ ఆయనతో సమావేశమయ్యారు. కిరణ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఉమెన్ చాందీ.. పార్టీ వీడిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. మా ఆహ్వానంపై కిరణ్ తుదినిర్ణయం తీసుకోవాల్సి వుందని తెలిపారు. నేతలు విభేదాలు పక్కనబెట్టి దేశం కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని చాందీ అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరే విషయంపై సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని కిరణ్ స్పష్టం చేశారు. 

loader