రాజమండ్రి: యూకే నుండి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా స్ట్రెయిన్ వైరస్ సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నాడు ప్రకటించింది.

ఢిల్లీలోని క్వారంటైన్ నుండి తప్పించుకొని ఈ మహిళ రాజమండ్రికి రైలులో వచ్చింది.రాజమండ్రికి యూకే నుండి వచ్చిన మహిళలను గుర్తించిన వైద్యులు ఆమెను పరీక్షించారు.యూకే నుండి రాజమండ్రికి వచ్చిన మహిళకు స్ట్రెయిన్ వైరస్ సోకిందని  మంగళవారం నాడు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

also read:స్ట్రెయిన్ పై ఆందోళన అవసరం లేదు, ముగ్గురికి కరోనా: సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా

ఈ మహిళ ద్వారా ఎవరికీ కూడ స్ట్రెయిన్ వైరస్ సోకలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రకటించారు. ఈ మహిళతో ప్రయాణించిన ఆమె కొడుకు స్ట్రెయిన్ సోకలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొత్త వైరస్ వ్యాప్తి చెందిన దాఖలాలు లేవని ఆయన స్పస్టం చేశారు. 

also read:స్ట్రెయిన్ పై ఆందోళన అవసరం లేదు: తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్

ఈ మహిళ ప్రయాణం చేసిన రైల్వే బోగీలు ఎవరెవరు ఉన్నారనే విషయమై కూడ అధికారలుు ఆరా తీశారు. వారికి కూడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదౌతున్నాయి.ఈ తరుణంలో స్ట్రెయిన్ కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.