హైదరాబాద్: కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. 

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ తరహాలోనే స్ట్రెయిన్ లక్షణాలున్నాయన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.  బ్రిటన్ నుండి వచ్చిన వారిలో 40 మంది నుండి ఇప్పటికే శాంపిల్స్ ను తాము పరీక్షించినట్టుగా ఆయన చెప్పారు.

ఇప్పటివరకు 20 మంది శాంపిళ్ల విశ్లేషణ జరిగిందని ఆయన తెలిపారు. వీటిలో మూడు శాంపిళ్లలో మూడు బ్రిటన్ కు చెందిన కొత్త రకం వైరస్ మూలాలను గుర్తించినట్టుగా ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరంం ఉందని ఆయన చెప్పారు.

also read:ఇండియాలో ప్రవేశించినస్ట్రెయిన్ : ఆరుగురికి కొత్త వైరస్, హైద్రాబాద్ లో ఇద్దరు

యూకే నుండి ఇండియాకు నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు 33 వేల మంది వచ్చారు. తెలంగాణకు ఈ నెల 9వ తేదీ తర్వాత 1216 మంది వచ్చినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించింది. వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ వైరస్ బ్రిటన్ లో వెలుగు చూసింది., ఈ వైరస్ వేగంగా విస్తరించే  లక్షణాలు కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.