స్ట్రెయిన్ పై ఆందోళన అవసరం లేదు: తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్

కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ పై  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఈటల రాజేందర్  చెప్పారు.

Telangana Health minister clarifies on strain virus lns


హైదరాబాద్: కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ పై  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఈటల రాజేందర్  చెప్పారు.

మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. స్ట్రెయిన్ వైరస్  పాత కరోనా వైరస్ లాంటిదేనని ఆయన చెప్పారు. ఈ వైరస్ సోకిన వారికి పాతపద్దతిలోనే చికిత్స అందిస్తున్నట్టుగా చెప్పారు.

శీతాకాలంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఇంకా ప్రచార మాధ్యమాలు ప్రజలను భయపెట్టవద్దని ఆయన కోరారు. కరోనా వైరస్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. యూకే నుండి డిసెంబర్ 9వ తేదీన తర్వాత 1216 మంది తెలంగాణఖు వచ్చారు. తెలంగాణకు వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

కరోనా పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను సీసీఎంబీకి పంపారు. వీరిలో ముగ్గురికి స్ట్రెయిన్ వైరస్ సోకిందని  సీసీఎంబీ తేల్చింది. కేవలం 40 మంది శాంపిల్స్ లో 20 మంది శాంపిల్స్ సీసీఎంబీ పరీక్షించింది. ఇంకా 20 మంది శాంపిల్స్ పరీక్షించాల్సి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios