ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్  రైలులోని ఓ బోగీలో ఇవాళ  తొక్కిసలాట  చోటు చేసుకుంది. ధీంతో ఇద్దరు విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్ధినులను  ఆసుపత్రిక తరలించి  చికిత్సఅందిస్తున్నారు.

విజయనగరం:ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్  రైలులో ని  ఓ బోగిలో  బుధవారంనాడు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విజయనగరం రైల్వేస్టేషన్  లో  ఇద్దరు విద్యార్ధినులను రైల్వే  అధికారులు దింపేశారు. అస్వస్థతకు గురైన తర్వాత ఇద్దరు విద్యార్ధినులను విజయనగరంలోని ప్రైవేట్ఆసుపత్రికి తరలించారు.విజయనగరం  ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్ధులకు చికిత్సఅందించారు. విద్యార్ధినుల ఆరోగ్యం నిలకడగా ఉందని  వైద్యులు  తెలిపారు.ప్రకాశం జిల్లా కంభంలో బీఈడీ  పరీక్ష  రాసి స్వస్థలం  ఒడిశాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులోని  ఒక బోగీలో200 మంది ఎక్కారు.  దీంతో ఈ బోగీలోని  ప్రయాణీకులకు ఊపిరి  ఆడలేదు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో  ఇద్దరు విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వెంటనే  విజయనగరం రైల్వేస్టేషన్ లో దింపేశారు. వారికి చికిత్సఅందించాలని అక్కడే విధులు నిర్వహిస్తున్న  రైల్వే సిబ్బందిని ఆదేశించారు. దీంతో  ఈ ఇద్దరిని విజయనగరంలోని  ప్రైవేట్  ఆసుపత్రికి తరలించారు.