తూర్పు గోదావరి జిల్లాలోని డొంకరాయి వద్ద సీలేరు నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు.ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని Sileru river నదిలో ఆదివారం నాడు పడవ బోల్తా పడింది.ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుండి ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు.గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో Boatలో ఎనిమిది మంది ఉన్నారు.

East Godavari జిల్లా Y. Ramavaram మండలం donkarai వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గల్లంతైన వారు వై.రామవరం మండలం మంగంపాడు గ్రామానికి చెందిన ఒకరు, టెలిక్యాంప్ గ్రామానికి చెందిన మరొకరుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.