ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు అన్నదమ్ముల లైంగిక దాడి, గత మూడు నెలలుగా...

two minor boys raped six year old boy in nellore
Highlights

నెల్లూరు జిల్లాలో దారుణం

నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్ అన్నదమ్ములు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మూడు నెలలుగా ఇలా బాలుడిపై అసహజమైన రీతిలో లైంగిక దాడి చేస్తుండగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో చిన్నారి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు పట్టణంలోని సుబేదారుపేట ప్రాంతానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. అయితే ఇతడి తల్లిదండ్రులిద్దరూ పనుల నిమిత్తం ఉదయం వెళ్లి సాయంత్రం వస్తున్నారు. దీంతో స్కూల్ అయిపోయాక బాలుడు ఒక్కడే ఇంట్లో ఉంటాడు.

దీంతో ఆ ఇంటిపక్కనే ఉండే ఇద్దరు మైనర్ అన్నదమ్ములు బాలుడిపై కన్నేశారు.  తల్లిదండ్రులు లేని సమయంలో బాలుడిని తమ ఇంటికి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవారు. ఇలా గత మూడు నెలలుగా బాలుడిపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.

అయితే ఆ చిన్నారి ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఉంటున్న కొడుకుపై నిఘా పెట్టగా అసలు విషయం తెలిసింది.  దీంతో కొడుకుపై జరిగిన అఘాయిత్యం పై తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.


  

loader