శ్రీసత్యసాయి జిల్లాలో రెండు చిరుతల మృతి: ఫారెస్ట్ అధికారుల విచారణ

శ్రీసత్యసాయి జిల్లాలో రెండు చిరుతల మృతి కలకలం రేపుతుంది.  రెండు  రోజుల వ్యవధిలో రెండు చిరుతలు మృతి చెందాయి. ఈ విషయమై  అటవీశాఖాధికారులు కేంద్రీకరించారు.

Two  Leopards Found Dead in Sathya Sai District lns

అనంతపురం: శ్రీసత్యసాయి  జిల్లాలో రెండు చిరుతల మృతి కలకలం రేపుతుంది.  రెండు రోజుల వ్యవధిలో  రెండు చిరుతల మృతిపై   ఫారెస్ట్ అధికారులు  ఆరా తీస్తున్నారు.  చిరుతల మరణాలపై కారణాలను విశ్లేషించేందుకు  అటవీశాఖా ఉన్నతాధికారులు  రానున్నారు.మడకశిర మండలం మెలవాయి శివారులో చిరుత మృతి చెందింది.  నిన్న కూడ  ఓ చిరుత మృతదేహన్ని గుర్తించారు అటవీ సిబ్బంది.నిన్న మృతి చెందిన చిరుత వయస్సు  ఏడాదిన్నర నుండి రెండేళ్ల వయస్సు ఉంటుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. చిరుతపులి మృతి చెందిన విషయాన్ని స్థానికులు  అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో సంఘటన స్థలాన్ని పెనుగొండ రేంజ్ ఎఫ్ఆర్ఓ  శ్రీనివాసులు పరిశీలించారు.   ఇవాళ కూడ  మరో చిరుత మృతి చెందడంపై  అటవీశాఖాధికారులు  అనుమానాలు వ్యక్తం  చేస్తున్నారు.  చిరుత మృతికి గల కారణాలపై  ఫారెస్టు అధికారులు పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.చనిపోయిన రెండు చిరుతలను  డీఎఫ్ఓ  రవీంద్రనాథ్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.ఒక ఆడ, ఒక మగ చిరుత చనిపోయినట్టుగా డీఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి  చెప్పారు. రెండు ఒకే సమయంలో చనిపోయి ఉండొచ్చని ఆయన అనుమానిస్తున్నారు.  పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే చిరుతల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios