విజయవాడ: కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం సూరంపల్లి మహిళా పారిశ్రామికవాడలో గురువారం నాడు మధ్యాహ్నం జయరాజ్ ఫ్లైవుడ్ కంపెనీలో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. దీంతో ఇద్దరు మరణించారు.

సూరంపల్లి పారిశ్రామిక వాడలో కెమికల్ డ్రమ్ములను ఆటోలో ఎక్కిస్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జయరాజ్ ఫ్లైవుడ్ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.కెమికల్ ఫ్యాక్టరీలో పేలుళ్లకు కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. గాయపడిన కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు.

ఏపీ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ఈ కమిటీ పర్యటించి పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సలహాలు, సూచనలు ఇవ్వనుంది.

రాష్ట్రంలోని విశాఖ జిల్లాలోని పలు ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. వరుస ప్రమాదాలతో విశాఖ వాసులు ఆందోళన చెందారు. విశాఖలో వరుస ప్రమాదాలో చోటు చేసుకోవడంపై కుట్ర కోణం కూడ ఉందేమోననే అభిప్రాయాన్ని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.