విశాఖపట్టణం: విశాఖ జిల్లా పెదబయలు మండలం చత్రాయిపుట్టులో జీలుగ కల్లు తాగి ఇద్దరు మృతి చెందారు.మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.పాడేరుకు సమీపంలో ఉన్న చత్రాయిపుట్టులో ఆరుగురు చిన్నారులతో పాటు ఓ మహిళ వంట చెరుకు కోసం కొండపైకి వెళ్లారు.

వేసవి కాలం కావడంతో కొండ దిగి వస్తుండగా దాహం వేసింది. ఎండల వేడిని తట్టుకోలేక కొండపై ఉన్న జీలుగ కల్లును  తాగారు. ఈ జీలుగ కల్లు తాగిన వారంతా అస్వస్థతకు గురయ్యారు. ఏడుగురిలో ఇద్దరు మృతి చెందారు. అస్వస్థతకు గురైన వారిని పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతుల్లో బుల్లెమ్మతో పాటు భగవతి మృతి చెందారు. మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండేది.