అనంతపురం: అనంతపురం జిల్లాలో గురువారం నాడు దారుణం చోటు చేసుకొంది. ఆస్తి తగాడాలతో ఇద్దరు చిన్నారులపై బంధువు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ చిన్నారిని చావు బతుకుల మధ్య ఉన్నాడు. మరొకరిని హంద్రీనీవా కాలువలో వేసినట్టుగా అనుమానిస్తున్నారు.

జిల్లాలోని గార్లదిన్నె మండలం మార్తాడులో ఈ ఘటన చోటు చేసుకొంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో  చిన్న పిల్లలకు చాక్లెట్లు ఆశ చూపిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

చిన్నారులు శశిధర్, మోక్షజ్ఞ ను బంధువు తీసుకెళ్లాడు.  కూడేరు సమీపంలో శశిధర్ ప్రాణాపాయస్థితిలో కన్పించాడు. మరో చిన్నారి మోక్షజ్ఞ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు.

 మోక్షజ్ఞ  ఎక్కడున్నాడో ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత కుటుంబానికి ఎవరెవరితో ఆస్తి తగాదాలు ఉన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ దారుణం చోటు చేసుకొందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.