Asianet News TeluguAsianet News Telugu

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం... ఢిల్లీలో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఆంధ్రా పోలీసులు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీలో ఇద్దరిని అరెస్ట్ చేశారు రాష్ట్ర పోలీసులు. ఛార్టెడ్ అకౌంటెంట్ విపిన్ కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ మీద వారిద్దరిని విజయవాడకు తీసుకొస్తున్నారు.

two arrested in delhi in ap skill development scam
Author
First Published Aug 25, 2022, 6:17 PM IST

చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరిట జరిగిన కుంభకోణానికి సంబంధించి ఇద్దరిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఛార్టెడ్ అకౌంటెంట్ విపిన్ కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ మీద వారిద్దరిని విజయవాడకు తీసుకొస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 7 వరకు జ్యూడిషియల్ కస్టడీకి కోర్ట్ ఆదేశించింది. 

2014- 15 మధ్యకాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును సిమెన్స్ ఇండియా ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కలిశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కోసం రూ.3,300 కోట్లతో సెంబర్ సబ్ ఎక్స్‌లెన్స్ ప్రోగ్రామ్‌ను ప్రతిపాదించారు. ఇందులో 90 శాతం గ్రాంట్‌గా ఇస్తామని.. పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని ప్రతిపాదించారు. అయితే ఎలాంటి పరిశీలన, నిర్ధారణ లేకుండా ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు. ఆయన ఆదేశాల మేరకు నిధులు విడుదల చేస్తూ అప్పటి ప్రిన్సిపాల్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆదేశాలు జారీ చేశారు. 

Also REad:స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: పీవీ రమేష్ ఇంటికి సీఐడీ పోలీసులు

అసలు ప్రాజెక్ట్ పనులు మొదలుకాకముందే అడ్వాన్స్ కింద రూ.370 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా అవినీతికి పాల్పడ్డారని గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వంలోని ఏపీఎస్ఎస్‌డీసీ ఎండీ ఘంటా సుబ్బారావు, డైరెక్టర్ రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వున్నాయి. 

సీమెన్స్‌-డిజైన్‌టెక్‌ సంస్థలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకున్నాయి.  నైపుణ్యాభివద్ధి కోసం ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పారు. దానికింద ఐదు టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలు నెలకొల్పారు. ఇలా ఒక సెంటర్‌, దాని పరిధిలో ఐదు టీఎస్డీఐల ఏర్పాటుకు అయ్యే ఖర్చు 546 కోట్లు. అందులో 90శాతం అంటే రూ.491కోట్లు సీమెన్స్‌-డిజైన్‌టెక్‌లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా భరించినవే. కేవలం 10శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.  

ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. ముంబై, పుణెకు చెందిన షెల్ కంపెనీలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా  సీఐడీ గుర్తించారు.  ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే సాఫ్ట్ వేర్  ఇచ్చినట్టుగా నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించారని కూడా సీఐడీ అధికారులు నిర్ధారించారు
 

Follow Us:
Download App:
  • android
  • ios