Asianet News TeluguAsianet News Telugu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: పీవీ రమేష్ ఇంటికి సీఐడీ పోలీసులు

సీమెన్స్ కేసులో  ఏపీ సీఐడీ  అధికారులు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ ను సమాచారం కోసం ఏపీ సీఐడీ అధికారులు  ఆయన ఇంటికి వచ్చారు. అయితే ఆ సమయంలో పీవీ రమేష్  ఇంట్లో లేరు. మరో నివాసంలో పీవీ రమేష్ నివాసం ఉంటున్నారు. దీంతో స్పీడ్ పోస్టులో సీఐడీ అధికారులుు ఆయనకు  ప్రశ్నలను పంపుతున్నారు.

AP Cid police  tries to questiong for  retired IAS officer PV Ramesh
Author
Guntur, First Published Dec 20, 2021, 7:31 PM IST

అమరావతి: Skill devlopment case లో ఏపీ సీఐడీ అధికారులు దూకుడును మరింత పెంచారు.  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రధానంగా స్కామ్ కు పాల్పడిన సీమెన్స్ కంపెనీకి సహకరించిందెవరనే విషయమై AP Cid  అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో మాజీ  ఐఎఎస్ అధికారి PV Ramesh  ఇంటికి ఏపీకి చెందిన సీఐడీ అధికారులు సోమవారం నాడు సమాచారం కోసం వచ్చారు.  Chandrababu సీఎంగా ఉన్న సమయంలో ఏపీ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీగా పీవీ రమేష్ ఉన్నారు. దీంతో  సమగ్రమైన సమాచారం సేకరించేందుకు వచ్చినట్టుగా సీఐడీ అధికారులు తెలిపారు.

also read:AP Skill development Corporation scamలో సీఐడీ దూకుడు: పుణెలో ముగ్గురి అరెస్ట్

Hyderabad  లోని ప్రశాసన్‌నగర్ లోని పీవీ రమేష్ ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులకు నిరాశ ఎదురైంది. గతంలో తాను నివాసం ఉన్న ఇంటిని పీవీ రమేష్ డెవలప్ మెంట్ కోసం కాంట్రాక్టర్ కు ఇచ్చాడు. దీంతో  ఏపీ సీఐడీ అధికారులు వెనుదిరిగారు. సీమెన్స్ కేసులో పీవీ రమేష్ కి స్పీడ్ పోస్టులో ప్రశ్నలను పంపుతామని సీఐడీ అధికారులు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలిసిన సమాచారాన్ని అడుగుతామని సీఐడీ అధికారులు చెప్పారు. సీమెన్స్ కేసులో ఇప్పటికే నలుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీమెన్స్ కేసులో రూ. 241 కోట్లు కుంభకోణం చోటు చేసుకొందని సీఐడీ చెబుతుంది. 

అసలేం జరిగిందంటే?

రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు ‘సీమెన్స్‌’ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టును సీమెన్స్‌ కంపెనీ తొలుత Gujarat లో అమలు చేసింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో అప్పటి Tdp ప్రభుత్వం కూడా ఆ సంస్థను ఆహ్వానించింది. సీమెన్స్‌-డిజైన్‌టెక్‌ సంస్థలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకున్నాయి.  నైపుణ్యాభివద్ధి కోసం ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పారు. దానికింద ఐదు టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలు నెలకొల్పారు. ఇలా ఒక సెంటర్‌, దాని పరిధిలో ఐదు టీఎస్డీఐల ఏర్పాటుకు అయ్యే ఖర్చు 546 కోట్లు. అందులో 90శాతం అంటే రూ.491కోట్లు సీమెన్స్‌-డిజైన్‌టెక్‌లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా భరించినవే. కేవలం 10శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.  

ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు.  

ముంబై, పుణెకు చెందిన షెల్ కంపెనీలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా  సీఐడీ గుర్తించారు.  ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే సాఫ్ట్ వేర్  ఇచ్చినట్టుగా నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించారని కూడా సీఐడీ అధికారులు నిర్ధారించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios