Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. పక్కా ప్లాన్‌తో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు..

విజయవాడలో మరోసారి  డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాలతో సంబంధం ఉన్న ఇద్దరు విద్యార్థులును పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ఫక్కీలో పక్క ప్లాన్‌తో వీరిని ట్రాప్ చేశారు. 

Two Arrested For Drugs Selling Links In Vijayawada
Author
Vijayawada, First Published May 18, 2022, 12:20 PM IST

విజయవాడలో మరోసారి  డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాలతో సంబంధం ఉన్న ఇద్దరు విద్యార్థులును పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ఫక్కీలో పక్క ప్లాన్‌తో వీరిని ట్రాప్ చేశారు. వారి వద్ద నుంచి 8 గ్రాముల మెథాంఫిటమైన్‌ను సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలు.. ఇటీవల కర్నూలు జిల్లాలో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్న ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సేకరించిన పోలీసులు డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన సమాచారం రాబట్టారు. ఈ క్రమంలోనే విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో ఉన్న ఐదుగురు వ్యక్తులకు డ్రగ్స్ విక్రయాలతో సంబంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతడితో ఆన్‌లైన్ ద్వారా పరిచయం పెంచుకున్న ఐదుగురు వ్యక్తులు డ్రగ్స్ కొనుగోలు చేసేవారని పోలీసులు కనుగొన్నారు.

ఈ క్రమంలోనే వివరాలు సేకరించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు  పక్కా ప్లాన్‌ వేశారు. నున్న గ్రామంలో ఉన్న వ్యక్తులకు పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తితో చేయించారు. తాను సరకు తీసుకువస్తున్నానని చెప్పించారు. దీంతో వారు నున్న శివారున ఉన్న వికాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల రోడ్డులో చినకంచి వద్ద ఒక కారులో ఉంటామని చెప్పారు. దీంతో కర్నూలు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముందుగానే అక్కడ మోహరించారు. ఈ క్రమంలోనే యశ్వంత్‌రెడ్డి, ఏకేశ్వరరెడ్డి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే పోలీసులను గుర్తించిన మరో ముగ్గురు సమీపంలోని తోటల్లోకి పారిపోయారు. ఇక, కర్నూలులో ఉన్న వ్యక్తికి ఈ ఐదుగురు రిటైలర్లుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా వీరు దందా సాగిస్తున్నారని పోలీసులు కనుగొన్నారు. ఇక, వీరి నుంచి డ్రగ్స్ ఎక్కడెక్కడికి వెళ్లాయనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

ఇక, ఇటీవల విజయవాడ నుంచి కొరియర్‌లో డ్రగ్స్ పంపిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. విజయవాడలోని డీటీఎస్ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు పంపిన పార్శిల్‌.. ఆస్ట్రేలియాకు బదులుగా పొరపాటున కెనడా చేరింది. అక్కడ కవర్‌పై సరైన స్టిక్కరింగ్‌ లేకపోవడంతో దానిని తిప్పి పంపించారు. బెంగళూరు కస్టమ్స్‌ అధికారులు ఆ పార్శిల్‌ను తనిఖీ చేయగా.. అందులో 4,496 గ్రాముల నిషేధిత ‘ఎఫెండ్రిన్‌’ అనే తెలుపు రంగు డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios