విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. రమేష్ ఆస్పత్రికి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యానికి మధ్య జరిగిన ఒప్పందం చుట్టూ విచారణ కొనసాగుతోంది. ఇరు వర్గాలు చేసుకున్న ఒప్పంద పత్రంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

స్వర్ణ ప్యాలెస్ నిర్వహణ బాధ్యత తమది కాదని రమేష్ ఆస్పత్రి వర్గాలు చెప్పిన నేపథ్యంలో వివాదం చోటు చేసుకుంది. స్వర్ణ ప్యాలెస్ తమ సంతకం మాత్రమే ఉన్న పత్రాన్ని పోలీసులకు చూపించింది. ఒప్పంద పత్రంపై ఇరు వర్గాల సంతకాలు ఉండాలని పోలీసులు అంటున్నారు. 

Also Read: ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘణ: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో 11కి చేరిన మృతులు

రమేష్ ఆస్పత్రి మాత్రం ఇప్పటి వరకు ఒప్పంద పత్రాన్ని పోలీసులకు సమర్పించలేదు. రెండు రోజులైనా ఒప్పంద పత్రం బయటకు రాలేదు. అసలు ఒప్పందం అనేది ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ లో ఇటీవల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. ఫైర్ సేఫ్టీ పాటించని కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చారు. 

Also Read: విజయవాడ కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం: స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆసుపత్రిపై కేసులు

రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ ను కోవిడ్ కోర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు స్వర్ణ ఆస్పత్రిలోనూ రమేష్ ఆస్పత్రిలోనూ తనిఖీలు నిర్వహించారు.