Asianet News TeluguAsianet News Telugu

దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు: జోసెఫ్, హత్య కేసులో మరో ట్విస్ట్

విజయవాడలోని దివ్య హత్య కేసు మరో మలుపు తీసుకుంది. నాగేంద్రకు సహకరించిన మహిళ గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా తన కూతురిని పథకం ప్రకారం నాగేంద్ర హత్య చేశాడని దివ్య తండ్రి ఆరోపిస్తున్నారు.

Twist in Divya murder case: Fathher accuses planned killing of Nagendra
Author
Vijayawada, First Published Oct 17, 2020, 11:21 AM IST

విజయవాడ: దివ్య హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. నాగేంద్ర, దివ్యల వివాహం రికార్డు కాలేదని పోలీసులు చెబుతున్నారు. వారిద్దరు 2018 మార్చిలో మంగళగిరి గుడిలో తాళి కట్టుకుని దండలు మార్చుకున్న ఫొటో మాత్రం ఉందని వారు గుర్తించారు. ఈ విషయంలో నాగేంద్రకు సహకరించిన మహిళ కూపీ లాగుతున్నారు. ఇందుకు పోలీసులు విష్ణు కాలేజీకి వెళ్లారు.

విజయవాడలో దివ్య అనే యువతిని నాగేంద్ర బాబు అత్యంత క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నాగేంద్ర కూడా కత్తితో తనకు తాను గాయాలు చేసుకుని ప్రస్తుతం అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దివ్య హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే విధంగా నాగేంద్రబాబు వాంగ్మూలం నేపథ్యంలో దివ్య తల్లిదండ్రులను మాచవరం పోలీసు స్టేషన్ లో విచారించారు. 

Also Read: దివ్య ఇన్‌స్టా వీడియోలో సంచలనం: రెండున్నర ఏళ్లుగా రిలేషన్‌షిప్, అతనో సైకో

నాగేంద్రకు దివ్య చివరిసారిగా మార్చి 28వ తేదీన ఫోన్ చేసింది. నాగేంద్ర ఏప్రిల్ 2వ తేదీన చివరిసారిగా దివ్యకు ఫోన్ చేశాడు. కేసును బెజవాడ పోలీసు స్టేషన్ నుంచి దిశ పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

నాగేంద్రను ఎన్ కౌంటర్ చేయాలని లేదా ఉరి తీయాలని దివ్య తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. తను కూతురిని అత్యంత కిరాతకంగా నాగేంద్ర హత్య చేశాడని, దివ్య శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నాయంటే ఎంత క్రూరంగా హత్య చేశాడో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. దివ్యను పథకం ప్రకారం హత్య చేశాడని, తాను చిన్న చిన్న గాయాలు మాత్రమే చేసుకున్నాడని ఆయన అంటున్నారు. హత్యానేరం నుంచి బయటపడానికి నాగేంద్ర ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. 

Also Read: బెజవాడ దివ్య హత్య కేసు: మృతురాలి ఇంట్లో ఫ్యాన్‌కు చీర, కొత్త అనుమానాలు..?

దివ్య వివాహం, ఇతర విషయాలు నిజం కాదని ఆయన అన్నారు. నాగేంద్రతో దివ్యకు ఇటీవలే పరిచయం ఏర్పడిందని ఆయన అన్నారు. నాగేంద్రకు ఎవరు సహకరించారో పోలీసులు వెలికి తీస్తారని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios