విజయవాడ: ఇంజనీరింగ్ విద్యార్దిని దివ్యతేజ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వీడియోల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.తాను రెండున్నర ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా దివ్యతేజ ప్రకటించారు.  ఆ తర్వాత అతను ఓ సైకో అని తెలిసిందని ఆమె బాధపడింది.

ఓ మహిళ వల్ల తాను మోసపోయాయని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలలుగా తాను మనోవేదనకు గురౌతున్నానని ఆమె ప్రకటించింది. తనకు అన్న ఉన్నాడనే నమ్మకం ఉందని దివ్య ప్రకటించింది.తనను ఉన్నతస్థానంలో చూడాలని పేరేంట్స్ అనుకొంటున్నారని దివ్య తెలిపింది.

also read:మా కూతురిని చంపినట్టే అతడిని చంపండి: నాగేంద్ర కామెంట్స్ పై దివ్య పేరేంట్స్

తానొక సైకోతో పోరాడుతున్నానని దివ్య తెలిపింది. ఈ నెల 3వ తేదీన వీడియోలో కీలక విషయాలను ఆమె వెల్లడించింది.మరోవైపు నాగేంద్రతో దివ్య ఫోన్ లో మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చింది. ఈ ఆడియో సంభాషణలో ఆమె తీవ్ర మానసిక సంఘర్షణకు గురైంది.అందరితో మాట్లాడుతున్నా.. కానీ నాలా ఉండలేకపోతున్నానని ఆమె బాధపడింది.

నాకు నువ్వు ఇంపార్టెంట్... అదే సమయంలో కెరియర్ కూడ ఇంపార్టెంట్ అని ఆమె చెప్పింది. ఎప్పుడూ లేని మార్పులు వస్తున్నాయని నాగేంద్రతో దివ్యతేజ ఫోన్ లో చెప్పారు.పెళ్లి విషయాన్ని దాచలేక మానసిక సంఘర్షణకు గురౌతున్నానని చెప్పారు. ఎవరిని సలహా అడగలేకపోతున్నానని ఆమె చెప్పారు.

దివ్య కుటుంబసభ్యులను పరామర్శించిన దిశ అధికారులు

దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పటేల్, కృతికా శుక్లాలు శుక్రవారం నాడు మధ్యాహ్నం కలిశారు. దివ్య కుటుంబసభ్యులను దిశ అధికారులు పరామర్శించారు.హత్యపై వివరాలను దివ్య కుటుంబసభ్యుల నుండి వివరాలను సేకరించారు. నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకొంటామని  ఐపీఎస్ అధికారి దీపికా పటేల్ చెప్పారు.

దివ్య ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో అంశాలను పరిశీలిస్తున్నామన్నారు.ఈ వీడియోను ల్యాబ్ కు పంపుతామన్నారు. ఆ వీడియో నిజమైందని తేలితే ఈ వీడియో సాక్ష్యం కిందకు వస్తోందని చెప్పారు.