పి.డబ్ల్యూ.డి  గ్రౌండ్స్ లో జులై 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎస్.వీ.వైభవోత్సవం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిత్యం 11 సేవలు వారం రోజులపాటు శాస్త్రోక్తంగా జరుగుతాయి. జులై 3న సాయంత్రం భూశుద్ధి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు వైభవోత్వవాలను ప్రారంభిస్తారు.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్యదర్శన అనుభూతిని ప్రత్యక్షంగా కలుగచేసేందుకు విజయవాడలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పి.డబ్ల్యూ.డి గ్రౌండ్స్ లో జులై 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎస్.వీ.వైభవోత్సవం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిత్యం 11 సేవలు వారం రోజులపాటు శాస్త్రోక్తంగా జరుగుతాయి. జులై 3న సాయంత్రం భూశుద్ధి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు వైభవోత్వవాలను ప్రారంభిస్తారు. స్వామి వారిని దర్శించే దివ్యాంగ భక్తుల్లో అవసరమైన వారు ఉదయం రిజిస్టర్ చేసుకుంటే సాయంత్రానికల్లా జైపూర్ కృత్రిమ పాదాన్ని ఉచితంగా అందజేస్తారు.

ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజను కూడా నిర్వహించి, భక్తజనకోటికి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రతి రోజు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే స్వామి వారి పూజ కార్యక్రమాలు తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, సమర్పణ, రెండవ నివేదన, సర్వదర్శనం, సహస్రదీపాలంకరణ సేవ, వీధి ఉత్సవం, రాత్రి కైంకర్యము, కొనసాగి ఏకాంత సేవ తో ముగుస్తాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుటుంబం ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటోంది.

నాలుగో తేదీ అష్టదళ పాద పద్మారాధనము, 5వ తేదీ సహస్రకలశాభిషేకం, 6వ తేదీ తిరుప్పావడ సేవ, 7వ తేదీన అభిషేకం , 8వ తేదీన వసంతోత్సవం, శ్రీనివాస కళ్యాణం, 9వ తేదీ పుష్పయాగం వంటి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 50 మంది వేదపండితులు, 250 మంది టీటీడీ సిబ్బంది, మరో 250 మంది నిర్వాహక సంస్థల సిబ్బంది ఈ సేవలకు భక్తులకు సహకరిస్తారు. వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమాల ప్రచారం కోసం రెండు రథాలు ఇప్పటికే ఊరూరా తిరుగుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

రోజూ లక్ష మంది భక్తులు స్వామి ఆశీస్సులు వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండేలా తిరుపతి తరహాలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దివ్యంగులు, వృద్దులు సౌలభ్యం కోసం వీల్ చైర్స్ ని అందుబాటులో ఉంచారు. భక్తుల సౌకర్యార్ధం వైద్య శిబిరం, అంబులెన్సు లను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా అగ్ని మాపక వాహనాన్ని అందుబాటులో ఉంచారు. వాహనాల పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా 300 కార్లు, వెయ్యి ద్విచక్ర వాహనాల కోసం ఏర్పాట్లు చేశారు.