Asianet News TeluguAsianet News Telugu

A2, A3లకు పోస్టింగ్: టిటిడి ఈవో జవహర్ రెడ్డి సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థాన నూతన ఈవోగా నియమితులైన కేఎస్ జవహర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

TTD EO Jawahar Reddy Sensational decision
Author
Amaravathi, First Published Oct 9, 2020, 9:24 AM IST

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థాన నూతన ఈవోగా నియమితులైన కేఎస్ జవహర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఆయన టిటిడి బదిలీ అయ్యేముందు ఓ  వివాదాస్పద జీవోను జారీ చేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో A2, A3గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ప్రొపెసర్లకు తిరిగి పోస్టింగ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

2018 ఆగస్టులో బలవన్మరణానికి పాల్పడిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా డాక్టర్ కిరీటి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డా.శశి కుమార్‌  లు A2, A3గా వున్నారు. ఓవైపు ఈ  ఆత్మహత్యపై సీఐడీ విచారణ జరుగుతుండగానే అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు ప్రొపెసర్లకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

read more   ఆ ముగ్గురి లైంగిక వేధింపులే కారణం: డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై సీఐడీ

చిత్తూరు జిల్లాలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో  లైంగిక వేధింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన డాక్టర్ శిల్ప 2018 ఆగస్ట్ 3వ తేదీన తన నివాసంలోనే  ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప ఆత్మహత్యకు కారణమైన పీడియాట్రిక్ విభాగం ప్రోఫెసర్ల లైంగిక వేధింపులే కారణమన్న అనుమానాలున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొన్న అప్పటి టిడిపి సర్కార్ ప్రొఫెసర్లపై చర్యలు తీసుకుంది. 

 తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని డాక్టర్ శిల్ప రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు విచారణ నిర్వహించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ నేతృత్వంలో కూడ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శిల్ప ఆత్మహత్య చేసుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios