ఈనెల 13 నుంచి 22 వరకు సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనం కేటాయించలేమని స్పష్టం చేశారు టీటీడీ (ttd) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) . తిరుమలలో తీవ్రమైన వసతి సమస్య ఉందని... వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు నందకం, వకుళ అతిథి గృహాల్లో వసతి కల్పిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పొందిన భక్తులకు తిరుపతిలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌లో వసతి కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. 

ఈనెల 13 నుంచి 22 వరకు సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనం కేటాయించలేమని స్పష్టం చేశారు టీటీడీ (ttd) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) .ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వీఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం కల్పిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. తిరుమలలో తీవ్రమైన వసతి సమస్య ఉందని... వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు నందకం, వకుళ అతిథి గృహాల్లో వసతి కల్పిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పొందిన భక్తులకు తిరుపతిలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌లో వసతి కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. 

కాగా.. ఇటీవల తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ( Vaikunta Dwara Darshan) విష‌యంలో కీల‌క మార్పులు చేసింది టీటీడీ దేవ‌స్థానం. ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనాన్ని 10 రోజుల పాటు చేసుకునేలా ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే భ‌క్తుల‌కు ఏడాది జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. 

ALso Read:Tirupati Vaikunta Dwara Darshan: శ్రీవారి భక్తులకు శుభవార్త.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం..

ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఏకాదశి, ద్వాదశి ఈ రెండు రోజులే వైకుంఠ ద్వారం తెరిచి ఉండటం వల్ల ఎక్కువ మందికి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవ‌డానికి అవ‌కాశం ల‌భించ‌డం లేదు. అందుకే టీడీడీ వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరువ‌నున్నారు. 

ఈ సంద‌ర్బంగా టీటీడీ అదనపు ఇవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనం పది రోజుల పాటు తెరిచి ఉంచాలని నిర్ణ‌యించిన‌ట్టు ధర్మారెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే టికెట్లు విడుదల చేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు వసతి సమస్య లేకుండా తిరుపతిలో బస చేయాలని సూచించారు. శ్రీవారి ద‌ర్శనానికి వ‌చ్చే భక్తులు ఖచ్చితంగా కోవిడ్ సర్టిఫికేట్ తీసుకొని రావాలని అన్నారు. టికెట్లు కలిగివుండి.. కోవిడ్ లక్షణాలు వుంటే.. దయచేసి తిరుమలకు రావద్దని అని భక్తులకు విజ్ఞప్తి చేశాడు. పది రోజులు పాటు రోజుకు 5 వేల ఆఫ్ లైన్ టికెట్లు చొప్పున స్థానికులకు కేటాయించామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతికి చెందిన భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు.