టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై టీటీడీ ఛైర్మన్  వైవీ సుబ్బారెడ్డి ఫైరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు దురుద్దేశంతోనే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో దళారి వ్యవస్థను రూపుమాపామని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు పొంతనలేని ఆరోపణలు పనిగట్టుకుని చేస్తున్నారని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏకాంతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని వైవీ తెలిపారు. 23న గరుడ వాహనం రోజు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.

గతంలో గరుడ వాహనం రోజున రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించేదని.. అయితే భద్రతా కారణాల దృష్ట్యా గత 13 ఏళ్లుగా ధ్వజారోహణం రోజున పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారని ఆయన తెలిపారు. ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నందున , 23న సీఎం జగన్ స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.