Asianet News TeluguAsianet News Telugu

గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి: కేంద్రానికి వైవీ సుబ్బారెడ్డి డిమాండ్

గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దీనికి సంబంధించి రేపు టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు.

ttd chairman yv subba reddy demand center for cow as national animal ksp
Author
Tirupati, First Published Feb 26, 2021, 9:02 PM IST | Last Updated Feb 26, 2021, 9:02 PM IST

గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దీనికి సంబంధించి రేపు టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు.

కళ్యాణమస్తు నిర్వహణకి మరిన్ని ముహూర్తాలు నిర్ణయిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మొదటి దశలో తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 31 ఆలయాలకు గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అలిపిరి టోల్‌గేట్‌ ఛార్జీలను పెంచింది. దీనికి సంబంధించి గత ఏడాది మార్చిలోనే టోల్ ఛార్జీలను పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. దీనిపై తాజాగా జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టోల్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి.

ఇప్పటి వరకూ కారుకు రూ.15 వసూలు చేయగా.. ఇక నుంచి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. మినీ బస్సు, మినీ లారీ టోల్ ఛార్జీని రూ.50 నుంచి రూ.100కు పెంచారు. లారీ, బస్సుకు ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తుండగా దాన్ని రూ.200 చేశారు.

సగటున రోజూ పది వేలకుపైగా వాహనాలు అలిపిరి మీదుగా తిరుమలకు వెళ్తుంటాయి. వారాంతాలు, పండుగలు ఇతర సెలవు దినాల్లో వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.

అలిపిరి వద్ద టీటీడీ అధికారులు నామమాత్రంగా టోల్ ఛార్జీలను వసూలు చేస్తుండేవారు. తాజాగా ఛార్జీల పెంపుతో శ్రీవారి దర్శనం కోసం వాహనాల్లో వచ్చే వారిపై అదనపు భారం పడనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios