మహాసంప్రోక్షణపై చర్చ, ఛైర్మన్ తీరుపై సభ్యుల ఆగ్రహం

TTD board meeting begins in Tirumala
Highlights

టీటీడీ బోర్డు ఛైర్మెన్  పుట్టా సుధాకర్ యాదవ్‌ తీరుపై  బోర్డు సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలకు విరుద్దంగా ఛైర్మన్  నిర్ణయాలు తీసుకోవడంపై  బోర్డు సభ్యులు  అభ్యంతరాలు వ్యక్తం చేశారని సమాచారం. 


తిరుపతి: టీటీడీ బోర్డు ఛైర్మన్  పుట్టా సుధాకర్ యాదవ్‌ తీరుపై  బోర్డు సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలకు విరుద్దంగా ఛైర్మన్  నిర్ణయాలు తీసుకోవడంపై  బోర్డు సభ్యులు  అభ్యంతరాలు వ్యక్తం చేశారని సమాచారం. 

టీటీడీ బోర్డు సమావేశం మంగళవారం నాడు తిరుమలలో జరిగింది. మహాసంప్రోక్షణ సమయంలో  భక్తులకు ఆలయ ప్రవేశం చేయకుండా చేయాలని గతంలో భావించారు. అయితే ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొన్నారు. మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు ఆలయం ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని బాబు సూచించారు.

అయితే ఈ విషయమై ఏం చేయాలనే దానిపై టీటీడీ బోర్డు మంగళవారం నాడు సమావేశమైంది. అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఛైర్మన్ జోక్యం చేసుకోవడంపై పాలకమండలి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. 

బోర్డు సభ్యులను ఛైర్మన్ కనీసం పట్టించుకోవడం లేదని సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని సమాచారం. మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించాలని కూడ పాలకవర్గ సభ్యులు సూచించారని తెలిసింది.

ఇదిలా  ఉంటే ఈ సమావేశంలో ఇద్దరు అధికారులు మినహా మిగిలిన వారిని బయటకు పంపారు. ఈ సమావేశంలో మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు ఆలయంలోకి వ్రవేశంపై  చర్చిస్తున్నారు.  ఏ రకంగా ఆ సమయంలో భక్తులకు ఆలయ ప్రవేశాలు కల్పించాలనే దానిపై చర్చిస్తున్నారు. 

గతంలో కూడ మహాసంప్రోక్షణ సందర్భంగా  అనుసరించిన పద్దతులను కొనసాగించాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ తరుణంలో  అదే రకమైన పద్దతులను అనుసరించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు  టీటీడీలో అర్చకులుగా పనిచేసి మానేసిన మిరాశీ అర్చకులకు పరిహారం చెల్లించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

 

loader