తిరుమల: ఉగాది నుంచి శ్రీవారి అర్జిత సేవలు.. టీటీడీ బోర్డ్ కీలక నిర్ణయాలు

వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశమైన టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.2,937 కోట్ల అంచనాతో బడ్జెట్‌ ఆమోదించారు.

ttd board key decisions ksp

వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశమైన టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.2,937 కోట్ల అంచనాతో బడ్జెట్‌ ఆమోదించారు.

ఉగాది నుంచి భక్తులకు ఆర్జిత సేవలు అందిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో.. తులాభారం కార్యక్రమం ప్రారంభిస్తామని వైవీ పేర్కొన్నారు.

టీటీడీ పరిధిలోకి వచ్చే ఆలయాలకు విధివిధానాలు ఖరారు చేశామని ఆయన తెలిపారు. కళ్యాణ మండపాలు లీజుకు ఇచ్చేందుకు రూపకల్పన చేశామని.. ఇందుకోసం విధివిధానాలు రూపొందించాలని అధికారులను పాలకమండలి ఆదేశించింది.

అలాగే నూతనంగా కళ్యాణ మండపాల నిర్మాణానికి బోర్డ్ పచ్చజెండా ఊపింది. బర్డ్ ఆసుపత్రిలో చిన్న పిల్లల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు. వేద పాఠశాలలన్నీ టీటీడీ వేద విజ్ఞాన పీఠం పరిధిలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడంతో పాటు గ్రీన్ పవర్‌ని వినియోగంలోకి తీసుకొస్తామని సుబ్బారెడ్డి  స్పష్టం చేశారు. ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని.. అయోధ్యలో శ్రీవారి ఆలయానికి స్థల కేటాయింపునకు యూపీ ప్రభుత్వాన్ని కోరతామని వైవీ పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios