హనుమంతుడి జన్మస్థలం తిరుమల అంజనాద్రే: టీటీడీ
: తిరుమలలోని అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది.
తిరుమల: తిరుమలలోని అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ పలు అంశాలను ఆధారంగా చేసుకొని ఈ విషయాన్ని ప్రకటించింది. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక ఆధారాలను టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ ఈ సందర్భంగా మీడియా ముందు ఉంచింది. టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, జాతీయ సంస్కృత వర్శిటీ వీసీ మురళీధరశర్మ బుధవారం నాడు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
also read:హనుమంతుని జన్మస్థానం తిరుమల.. ఉగాదికి నిరూపిస్తాం.. టీటీడీ
వెంకటాచలాన్ని పురాణాల్లో అంజనాద్రి అని కూడా పిలిచేవారని కూడ ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గుర్తు చేశారు. వెంకటాచలానికి 20 పేర్లు ఉన్న విసయాన్ని వారు గుర్తు చేశారు. అన్ని పురాణాల్లో కూడా అంజనాదేవి వెంకటాచలానికి వచ్చారని ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు.
ఆకాశగంగ తీర్థం సమీపంలో అంజనాదేవి 12 ఏళ్ల పాటు తపస్సు చేశారని చెప్పేందుకు ఆధారాలున్నాయని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాయుదేవుడు ఇచ్చిన ఫలాన్ని తిన్న అంజనాదేవి తిన్నదని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆకాశగంగ సమీపంలో హనుమంతుడికి ఆమె జన్మనిచ్చిందని ఆధారాలున్నాయన్నారు.4 నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించినట్టుగా చెప్పారు. హనుమంతుడి జన్మస్థలం నిర్ధారించేందుకు టీటీడీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చారిత్రక నిపుణులు, హిందూ మతానికి చెందిన పెద్దలు, వైదిక స్కాలర్స్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.