అనంతపురం టిడిపి ఎంపి జెసికి ట్రూజెట్ విమాన సంస్ధ టిక్కెట్టు ఇవ్వటానికి నిరాకరించింది.
వివాదాస్పద ఎంపి జెసి దివాకర్ రెడ్డికి దిమ్మతిరిగింది. తానేమి చేసినా చెల్లుబాటవుతుందని విర్రవీగుతున్న అనంతపురం టిడిపి ఎంపి జెసికి ట్రూజెట్ విమాన సంస్ధ టిక్కెట్టు ఇవ్వటానికి నిరాకరించింది. దాంతో జెసి నిరసతో విమానాశ్రయం నుండి వెనక్కి తిరగాల్సి వచ్చింది.
ఇంతకీ జరిగిందేమిటంటే, ఆదివారం హైదరాబాద్ నుండి విజయవాడకు జెసి వెళదామనుకున్నారు. అందుకని ఉదయం జెసి శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకుని ట్రూజెట్ విమానం టెక్కెట్టుకు ప్రయత్నించారు. అయితే, విశాఖపట్నంలో జెసి వీరంగం వల్ల కొన్ని విమానయాన సంస్ధలు ప్రయాణాన్ని బ్యాన్ చేసాయి. అందులో ట్రూజెట్ సంస్ధ కూడా ఉంది. ఇపుడదే సంస్ధ విమానంలో జెసి ప్రయాణిద్దామని అనుకున్నారు. అయితే, ఎంపికి టిక్కెట్టు ఇవ్వటానికి సంస్ధ నిరాకరించింది. ఎంతసేపు టిక్కెట్టు కోసం ఎంపి ప్రయత్నించినా టిక్కెట్టు సాధించలేకపోయారు. చేసేది లేక చివరకు విమానాశ్రయం నుండి వెనుదిరిగారు.
