వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగతి పబ్లికేషన్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడులు పెట్టారు. అందుకని వారి పెట్టుబడి రూ. 34.64 కోట్లను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. ఆ విషయంపైనే అప్పీలేట్ ట్రైబ్యునల్ ఈడికి తలంటిపోసింది.

జప్తుకు చేస్తూ ఈడీ ఇచ్చిన ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టివేసింది. మోసపూరితంగా పెట్టుబడులు స్వీకరిస్తే మనీలాండరింగ్ ఎలా అవుతుందన్న ప్రశ్నకు ఈడి సమాధానం ఇవ్వలేకపోయింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో ఈడీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 

జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన రూ. 34.64 కోట్లను తాత్కాలిక జప్తు చేస్తూ 2013లో ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టేసింది. జగతి పబ్లికేషన్స్‌లో టీఆర్ కణ్ణన్, ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్ అనే ముగ్గురు వ్యాపారులు 34.64 కోట్లు పెట్టబడులు పెట్టారు.