ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. గ్రీన్ కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. యూనిట్ ధర రూ.4.50 నుంచి రూ.2.44కి తగ్గించాలని గ్రీన్ కో కంపెనీ కి ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా.. దీనిపై సదరు కంపెనీ స్పందించింది. ఈ ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని గ్రీన్ కో కంపెనీ తేల్చి చెప్పింది. రాజస్తాన్ లో రూ.2.44కి యూనిట్ ఇచ్చినంత మాత్రాన అదే ధరకు ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం కుదరదని గ్రీన్ కో కంపెనీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. జులై 12న గ్రీన్ కో కంపెనీకి చెందిన మూడు యూనిట్లకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ట్రిబ్యునల్ తప్పుపట్టింది.