అమరావతిలో 8 అంతర్జాతీయ స్కూళ్లకు భూముల కేటాయింపు

tremors felt in krishna district in the vicinity of capital Amaravati Amaravati Kaburlu
Highlights

అమరావతి నుంచి...

  • అమరావతిలో 8 అంతర్జాతీయ  స్కూళ్లు
  • కృష్ణా జిల్లాలో పలుచోట్ల భూ ప్రకంపనలు
  • కోర్టు ఎగ్గొట్టడానికే జగన్ పాదయాత్ర
  • మహిళా న్యాయవాది మీద హత్యా యత్నం

ఎన్టీఆర్ ఎందుకు సక్సెస్ అయ్యారో యనమల చెబుతున్నారు...

తెలుగుదేశం సంస్థాపకుడు ఎన్ టి రామారావు రాజకీయాలలో ఎందుకు విజయవంతమయ్యారో ఆర్థిక మంత్రి చెబుతున్నారు.

‘‘ఎన్టీఆర్ సినిమా నటుడు కావటంతో ఆయన అనేక రోల్స్ చేశారు.. కాబట్టి ఆయనకు పేదల సమస్యలు ఎక్కువగా తెలుసు.. అలాంటి నాయకుడు టీడీపీ స్థాపించటం మన అదృష్టం. ఆయన సక్సెస్ కారణం అదే. ఎన్టీఆర్ ఆశయాలను ఆచరణలో పెట్టి పార్టీని క్రమశిక్షణ తో నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు,’’ అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

వియవాడలో తెలుగుదేశం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఇంకా ఇలా అన్నారు. ప్రతిపక్ష నేతకు జగన్ కు  ప్రత్యేక ప్యాకేజి అంటే అసలు తెలుసా?  కోర్టును తప్పించుకునేందుకు పాదయాత్ర డ్రామా ఆడుతున్నాడని విమర్శిస్తూ కోర్టు కు హాజరుకాకుండా తప్పించుకేన్నా జగన్ శిక్షను తప్పించుకునే పరిస్థితి లేదని అన్నారు.

‘‘ఇన్ని కేసులు ఉన్న జగన్ కోసమే ఐపిసి పెట్టినట్లుగా ఉంది.. క్యారెక్టర్ లేనివాళ్ల ను ప్రజలు ఆదరించరు..2014 లో అనేక కష్టాల్లో మనం అధికారంలోకి రాగలిగాం..ఇప్పుడు మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాము.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలం గా మారుతుంది... జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు,’’ అని యనమల అన్నారు.

  కూచిపూడి ఎస్సై వేధింపులతో యువకుని ఆత్మహత్య

వరకట్న వేధింపుల కేసులో రాజీ కుదుర్చుకోవాలని ఎస్ఐ సునీల్ ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపం చెంది మొవ్వ మండలం కోసూరు తురకపాలెం యువకుడు వీరంకి శ్రీహరి బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీహరి భార్య లక్ష్మి నాలుగురోజుల క్రితం కూచిపూడి పోలీస్ స్టేషన్లో వరకట్నం వేధింపు మీద భర్త అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన ఎస్ఐ, శ్రీహరి వాదన వినకుండా 2 లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ కుదుర్చుకోవాలని, లేకపోతే ఆమెను కాపురానికి పంపిస్తాన ని హెచ్చరించాడు. లక్ష రూపాయలు అప్పు చేసి ఇవ్వగలనని అంతకు మించి ఇవ్వలేనని మొత్తుకున్నా ఎస్ ఐ వినలేదు. కానిస్టేబుల్ ను ఇచ్చి లక్ష్మీ ని శ్రీహరి ఇంటికి పంపాడు. ఆమెను కాపురానికి పంపితే  తన కూతురిని చంపేస్తుందని ఒక్కరోజు అగాలని కోరినా ఎస్ ఐ వినకుండా అతన్నీ ఇంటికి పంపించి వేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీ హరి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళుతూ దారిలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు

అమరావతిలో 8 అంతర్జాతీయ స్కూళ్లకు భూముల కేటాయింపు

అమరావతిలో 8 అంతర్జాతీయ స్కూళ్లకి  కి 32 ఎకరాలభూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఈ రోజు జరిగిన సిఆర్ డిఎ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కూళ్లలో ఒకటి ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్ కాగా మిగిలినవి డే స్కాలర్ స్కూళ్లు. అలాగే  ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల కోసం ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం, శాసన సభ్యుల  కోసంచేపట్టాలనుకున్న ఇళ్ల నిర్మాణానికి కూడా  టెండర్లు పిలిచారు. మొత్తం 3820 అపార్ట్మెంట్ లుంటాయి.ఇవన్నీ 61 టవర్ల లో ఉంటాయి. వీలైనంత తొందరలో శాశ్వత అసెంబ్లీ,సెక్రటేరియట్.. హైకోర్టు, రాజ్ భవన్,   సీఎం బంగ్లా ల డిజైనింగ్ పై నార్మన్ ఫాస్టర్ తో ఫారిన్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. నవంబర్  మొదటి వారం లో ఫైనలైజ్ చేస్తారు. సమావేశం వివరాలను మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.

విశాఖలో 13న  పెట్రోలు పంపులు బంద్

విశాఖపట్నంలో  24 గంటల పాటూ పెట్రోల్ బంకుల బంద్ పాటించబోతున్నారు. ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు పెట్రోలు బంక్‌లు బంద్‌  పాటించనున్నట్లు నగర పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నారాయణ రెడ్డి ప్రకటించారు. ఇంధన విక్రయాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ ఈ బంద్ పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు.  క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని దేశాల్లో ఇంధన ధరలు ఒకేలా ఉండగా, మన దేశంలో మాత్రం రోజుకో విధంగా పెట్రోల్ ధరలు మారుస్తూ కేంద్రం దోపిడీకి పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు.
 ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే  విషయమై  స్పందించకుంటే ఈ నెల 27 నుంచి నిరవదిక సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు.

కోర్టు ఎగ్గొట్టాడనికేనా జగన్ పాదయాత్ర

టిడిపి నేత వర్ల రాయమ్య ప్రశ్న

 

పాద‌యాత్ర పేరుతో ఆరు నెల‌ల పాటు కోర్టుకు హాజ‌ర‌వ‌కుండా న్యాయ‌స్థానాన్ని ముంద‌స్తు అనుమ‌తి కోర‌డం ప‌ట్ల వైసీపీ అధనేత వై.ఎస్‌.జ‌గ‌న్ త‌న వైఖ‌రి ఏంటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మ‌న్ వ‌ర్ల రామ‌య్య డిమాండ్ చేశారు. ఆంధ్ర‌ప‌దేశ్ స‌చివాల‌యంలోని ప‌బ్లిసిటీ సెల్‌లో ఆయ‌న బుధ‌వారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టు నుంచి నోటీసులు అందితే ప్ర‌తి ఒక్క‌రూ హాజ‌ర‌వుతున్నార‌ని అందుకు విరుద్దంగా జ‌గ‌న్ మాత్రం కోర్టుకు రానూ అంటూ ముంద‌స్తు అనుమ‌తి కోర‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ ప‌రోక్షంగా న్యాయ‌స్థానంపైన ఒత్తిడి చేస్తున్నాడ‌ని ఆరోపించారు. కోర్టు అనుమ‌తి ఇవ్వ‌క‌ముందే పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వ‌డంలో అర్థం ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. కోర్టును దిక్క‌రించ‌డం ప‌ట్ల జ‌గ‌న్ అహం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఎన్ని సాక్షాలు చూపినా కూడా శిక్ష నుంచి త‌ప్పించుకోలేవ‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు ఆయ‌న స‌ల‌హాదారు ప్ర‌శాంత్‌కిషోర్ హెచ్చ‌రించాడ‌ని తెలిపారు. ఆరు నెల‌ల పాటు ఏ విధంగా కోర్టు అనుమ‌తి ఇస్తుందో జ‌గ‌న్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న త‌ప్పును ఒప్పుకుని కోర్టుకు హాజ‌రుకావాల‌ని సూచించారు.

 

 

 

అమరావతి భూకంపం జోన్ లో ఉందా? ఇది ఆ మధ్య చర్చనీయాంశమయింది. ఇది అవునేమో అనిపించేలా మంగళవారం రాత్రి,  బుధవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లాలో భూమికంపించింది. మొదట గన్నవరం పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది.దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల  నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి 10.15 గంటల సమయంలో గన్నవరంతోపాటు కేసరపల్లి, బుద్ధవరం, మర్లపాలెం, విఎన్‌ పురం, దుర్గాపురం, దావాజీగూడెం, ముస్తాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఇళ్లల్లోని వస్తువులు బాగా శబ్ధం చేస్తూ కదలడంతో భూకంపం అనే అనుమానం వచ్చింది. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్న ప్రజలు ఈ  ప్రభావం బాగా చూశారు. రాత్రి 11 గంటల సమయంలో మరోసారి  కంపించినట్లు కొందరు తెలిపారు. ఈ ప్రాంతంలో 2015 తర్వాత  భూప్రకంపనలు రావడం ఇది రెండోసారి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లావారే వరకూ  బిక్కుబిక్కుమంటూ ఆరు బయటే గడిపారు.

 మహిళా న్యాయవాది మీద దాడి

విజయవాడ, కొత్తపేటలోని బంకా కామరాజు వీధిలో మహిళా న్యాయవాది బాయన వెంకట రమణి పై దుండగుల దాడి చేశారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో  వచ్చి ముఖంపై పిడిగుద్దులు ,హత్యాయత్నం  చేశారు. ఆమె 
గట్టిగా అరవడంతో  స్ధానికులు రాకతో ఇద్దరు దుండగులు పరారయ్యారు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె కోలుకుంటున్నారు.
బెజవాడ బార్ అసోషియేషన్ న్యాయవాదులు దాడిపై పోలీసు కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
దాడికి పాల్పడిన రౌడీషీటర్ శివ , మరో వ్యక్తిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించాలని కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ నిర్ణయించింది. 

 

loader