పులిచింతల వద్ద వణికిస్తున్న వరుస భూకంపాలు: భయాందోళనలో స్థానికులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పులిచింతల ప్రాజెక్టు వద్ద ఇటీవల కాలంలో తరచుగా భూమి కంపిస్తుంది.
పల్నాడు: జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో ఆదివారం నాడు ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. . రెండు దఫాలు భూకంపం వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన సమయంలో భారీ శబ్దం వచ్చింది.. పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలోని జడేపల్లి తండా, కంచిబోడుతండాల్లో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెర్వు ప్రాంతల్లో కూడా భూకంపం వచ్చింది. గతంలో కూడా ఇదే తరహలో భూకంపాలు జరిగాయి. పులిచింతల ప్రాజెక్టు వద్ద తరచుగా భూకంపాలు చోటు చేసుకోవడంపై గతంలో కూడా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు.
పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలోని గ్రామాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కవగా నమోదౌతున్నాయి.ఈ ప్రాజెక్టుకు సమీపంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గ్రామాల్లో భూమి కంపించిన ఘటనలు నమోదౌతున్నాయి. ఇవాళ కూడ భూమి కంపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
also read:సూర్యాపేట జిల్లాలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 3.2 గా తీవ్రత నమోదు
2021 ఆగష్టు 08న పులిచింతల ప్రాజెక్టు వద్ద భూకంపం వాటిల్లింది. మూడు దఫాలు భూమి కంపించింది. సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా లో కూడా భూకంపం వచ్చింది. జిల్లలోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు,వీరులపాడు మండలాల్లో భూకంపం వచ్చింది. రెండు నుంచి మూడు సెకండ్ల పాటు కంపించిందని స్థానికులు చెప్పారు. భూమి కంపించడంతో భయాందోళనలకు గురై ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.