అనంతపురం: భారీగా ఆస్తులను కలిగి ఉన్న ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్‌పై ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

తన వద్ద పనిచేసే డ్రైవర్ నాగలింగం ఇంట్లో భారీగా బంగారం, వెండి, ఆస్తిపత్రాలను ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ దాచిపెట్టాడు. ఈ నెల 18వ తేదీన నాగలింగం మామ బాలప్ప ఇంట్లో నుండి వీటిని స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.

మనోజ్ కుమార్ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎక్కడి నుండి సంపాదించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్ కుమార్ పై ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

also read:భార్యతో మనోజ్‌కు గొడవ: ట్రంకు పెట్టెల్లో భారీగా బయటపడ్డ ఆస్తులు

2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ. 49 లక్షల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లు, రూ. 27 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు, రూ. 15 లక్షల విలువైన నగదును పోలీసులు 8 ట్రంకు పెట్టెల నుండి స్వాధీనం చేసుకొన్నారు.

బుక్కరాయసముద్రంలోని బాలప్ప నివాసం నుండి వీటిని స్వాధీనం చేసుకొన్నారు. మనోజ్ కుమార్ కు సంబంధించిన ఆస్తులపై విచారణ జరపాలని పోలీసు శాఖ కోరింది. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ జరపనున్నారు. భార్యాభర్తల గొడవల నేపథ్యంలో మనోజ్ కుమార్ ఆస్తుల వ్యవహరం వెలుగు చూసిన విషయం తెలిసిందే.